మహేశ్ మూవీ కోసం రష్మికకి భారీ పారితోషికం
Advertisement
తెలుగు తెరపై వరుస విజయాలతో దూసుకుపోతోన్న కథానాయికల జాబితాలో రష్మిక మందన కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ జోడీగా ఆమె చేసిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఆమె ఏకంగా మహేశ్ బాబు 26వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కెరియర్ తొలినాళ్లలోనే ఆమె మహేశ్ బాబు సరసన ఛాన్స్ కొట్టేయడం అంత తేలికైన విషయం కాదు.

మహేశ్ బాబు జోడీగా అనే సరికి పారితోషికం తక్కువైనా ఆమె ఒప్పేసుకుని ఉంటుందనుకుంటే పొరపాటే. ఈ సినిమాకిగాను ఆమెకి కోటి రూపాయలకి పైగా పారితోషికం ముట్టనుందని అంటున్నారు. ప్రస్తుతం రష్మికకి యూత్ లో వున్న క్రేజ్ కారణంగా ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడలేదని చెప్పుకుంటున్నారు. 'డియర్ కామ్రేడ్' హిట్ అయితే ఆమె పారితోషికం మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
Wed, Jul 10, 2019, 11:14 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View