సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  తాను ముంబైలో ఇటీవల 16 కోట్లు వెచ్చించి ఓ ఫ్లాటు కొన్నట్టు వస్తున్న వార్తలను కథానాయిక తమన్నా ఖండించింది. ఆ ప్రాంతంలో వున్న ధరకు రెట్టింపు పెట్టి ఆమె కొన్నట్టు వార్తలు రావడంతో తను స్పందించింది. 'ఇల్లు కొన్న మాట నిజమే కానీ, రెట్టింపు ధర మాత్రం పెట్టలేదు. ఎక్కువ ఇవ్వడానికి నేనేమైనా అమాయకురాలినా?' అంటూ అమ్మడు ప్రశ్నించింది.
*  ఇటీవల వచ్చిన 'ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం కొత్తతరహాలో సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో దీనికి సీక్వెల్ చేసే యోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. ఇందులో హీరో పాత్ర కోసం నానిని ప్రయత్నిస్తున్నట్టు, ప్రస్తుతం ఈ విషయంలో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.
*  నాగార్జున హోస్ట్ గా ఈ నెల 21 నుంచి 'బిగ్ బాస్ 3' సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంలో ఇంకా ఓ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో పలు చిత్రాలలో కథానాయికగా నటించిన హెబ్బాపటేల్ ఓ కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వుందని నిన్నటి నుంచి వార్తలొస్తున్నాయి.
Wed, Jul 10, 2019, 07:14 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View