నాగశౌర్య ఓకే చేసిన ప్రాజెక్టులు!
Advertisement
ఇటీవలే ఒక సినిమా షూటింగులో గాయపడిన నాగశౌర్య, ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న ప్రాజెక్టులపై అభిమానుల్లో కొంత అయోమయం నెలకొంది. ఈ విషయాన్ని గ్రహించిన నాగశౌర్య తాజాగా క్లారిటీ ఇచ్చాడు.

"నా తాజా చిత్రంగా 'అశ్వద్ధామ' రూపొందుతోంది. నా సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకి నేనే కథను అందించాను. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా కూడా షూటింగు దశలోనే వుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూళ్లు పూర్తిచేసేసుకుంది. ఇక త్వరలో 'పార్థు' అనే సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. 'సుబ్రహ్మణ్య పురం' దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తాడు" అని చెప్పుకొచ్చాడు.
Tue, Jul 09, 2019, 05:46 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View