గుంటూరులో 'ఇస్మార్ట్ శంకర్' ఈవెంట్
Advertisement
ఇటు పూరి జగన్నాథ్ అభిమానులు .. అటు రామ్ ఫ్యాన్స్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్లో నిర్వహించారు. రేపు ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను గుంటూరులో ప్లాన్ చేశారు.

గుంటూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో ఈవెంట్ ను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ ఈవెంట్ ను జరపనున్నారు. డిఫరెంట్ లుక్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.
Tue, Jul 09, 2019, 04:37 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View