మనసు మార్చుకున్న నాగార్జున
Advertisement
నాగార్జున తాజా చిత్రంగా రూపొందిన 'మన్మథుడు 2' ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాగార్జున సరసన నాయికగా రకుల్ నటించింది. ఈ సినిమా తరువాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తను చేయనున్న 'బంగార్రాజు' సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ విషయంలో ఆయన మనసు మార్చుకున్నారన్నదే తాజా సమాచారం. 'బిగ్ బాస్ 3'కి హోస్ట్ గా వ్యవహరించనున్న కారణంగా, నాగార్జున ఓ మూడు నెలల పాటు బిజీగా వుంటారు. అందువలన ఆ తరువాతనే 'బంగార్రాజు' ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచనలో ఆయన వున్నారని సమాచారం. ఈ సినిమాను ఆయన వచ్చే వేసవి సెలవులకి విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. 
Tue, Jul 09, 2019, 02:33 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View