సొంత సినిమాలతో నాన్నకి నష్టాలు తెచ్చానే అనే బాధ వుంది: ఎస్.పి.చరణ్
Advertisement
తమిళంలో నిర్మాతగా ఎస్.పి.చరణ్ కొన్ని సినిమాలను నిర్మించాడు. ఆ సినిమాల్లో 'వర్షం' రీమేక్ ఒకటి. ఆ సినిమాను గురించి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. తెలుగులో సక్సెస్ అయిన 'వర్షం' సినిమాను తమిళంలో నిర్మించాను. ఆ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయానికి బిజినెస్ జరిగిపోవడంతో .. అడ్వాన్సులతోనే పెట్టిన డబ్బులు వచ్చేయడంతో పొగరెక్కింది.

దాంతో తెలుగులో కంటే ఎక్కువగా ఖర్చుపెట్టేసి క్లైమాక్స్ ను చిత్రీకరించాము. అలా ఖర్చుపెట్టేసిన డబ్బులు మాత్రం రాలేదు. దాంతో ఆ సినిమాతో భారీ నష్టమే మిగిలింది. ఇలా నేను తీసిన సినిమాల వలన చాలా డబ్బు పోయింది. నాన్న సంపాదించిన డబ్బులు పోగొట్టానే అని ఇప్పటికీ బాధపడుతుంటాను" అని చెప్పుకొచ్చాడు. 
Tue, Jul 09, 2019, 02:11 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View