'డియర్ కామ్రేడ్' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది
Advertisement
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'డియర్ కామ్రేడ్' సినిమా రూపొందింది. రష్మిక మందన .. శృతి రామచంద్రన్ కథానాయికలుగా ఈ సినిమా నిర్మితమైంది. జూలై 26వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 11న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ట్రైలర్ ను వదలనున్నారు. తెలుగుతో పాటు మిగతా మూడు భాషల్లోను ఇదే ముహూర్తానికి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు పెరిగిపోతాయన్నది చూడాలి. 
Tue, Jul 09, 2019, 01:47 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View