నాని డబ్బింగ్ తో 'ది లయన్ కింగ్' టీజర్
Advertisement
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పిల్లలందరి దృష్టి జంగిల్ యానిమేషన్ మూవీ 'ది లయన్ కింగ్' పైనే వుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఆయా భాషలకి చెందిన ప్రముఖ హీరోలతో ఈ యానిమేషన్ సినిమాలోని పాత్రలకి డబ్బింగ్ చెప్పించారు.

అలా తెలుగులో 'సింబా' పాత్రకి హీరో నానీతో డబ్బింగ్ చెప్పించారు. తాను డబ్బింగ్ చెప్పిన వీడియోతో లింక్ చేయబడిన టీజర్ ను నాని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. "మా నాన్న ఒకసారి చెప్పారు .. సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని" అంటూ నాని డబ్బింగ్ చెప్పిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని మిగతా పాత్రలకి జగపతిబాబు .. బ్రహ్మానందం .. అలీ .. రవిశంకర్ వాయిస్ ఇచ్చారు. ఈ సినిమా ఏ స్థాయిలో చిన్నారులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Tue, Jul 09, 2019, 12:47 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View