నాన్న పేరును అడ్డుపెట్టుకుని అవకాశాలు సంపాదించలేదు: ఎస్.పి.చరణ్
Advertisement
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి.చరణ్ మాట్లాడుతూ, "మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో అంత గౌరవం. ఆయన పేరు ప్రతిష్ఠలను ఉపయోగించుకోవడానికీ .. నాకు సంబంధించిన పనులు కావడానికి ఆయనతో సిఫార్స్ చేయించుకోవడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు.

గాయకుడిగా సినిమాల్లో ఇంతవరకూ వచ్చిన అవకాశాలు .. సీరియల్స్ నటుడిగా ఇంతవరకూ వచ్చిన అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ఇక నిర్మాతగా సినిమాలు చేస్తున్నప్పుడు కూడా, ఫలానా ఆర్టిస్టుల డేట్స్ కావాలి .. మీరు మాట్లాడండి అని కూడా ఆయనను నేను ఎప్పుడూ అడగలేదు. అలాగే నాకు ఫలానా సినిమాలో నటించాలని వుంది .. మీరు ఒక మాట చెబితే సరిపోతుంది అని కూడా అనలేదు. ప్రొఫెషన్ పరంగా నాన్న పేరును వాడుకోవడమనేది ఇంతవరకూ జరగలేదు" అని చెప్పుకొచ్చాడు.
Tue, Jul 09, 2019, 11:25 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View