అడివి శేష్ హీరోగా 'ఎవరు'.. ప్రీ లుక్ రిలీజ్
Advertisement
మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ కారణంగానే నటుడిగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా 'ఎవరు' అనే సినిమా రూపొందుతోంది. రాంజీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ నెల 11వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన నాయికగా రెజీనా నటిస్తోంది. తెలుగు తెరపై రెజీనా జోరు తగ్గి కొంతకాలమవుతోంది. సరైన సినిమా పడితే తన జోరును మళ్లీ కొనసాగించాలనే ఉద్దేశంతో ఆమె వుంది. ఈ సినిమా ఆమె కెరియర్ ను మళ్లీ గాడిలో పెడుతుందేమో చూడాలి. 
Tue, Jul 09, 2019, 11:00 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View