'మన్మథుడు 2'లో రకుల్ పాత్రను పరిచయం చేస్తూ 'మీట్ అవంతిక' వీడియో
Advertisement
నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్ర 'మన్మథుడు 2' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రకుల్ పోషించిన 'అవంతిక' పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.

రకుల్ చిలిపితనం .. కొంటెతనం ..  అల్లరితనానికి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ వీడియో ఆకట్టుకునేలా వుంది. 'ఇప్పటిదాకా U సర్టిఫికెట్ కోసం ప్రయత్నించాను. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తా' అనే రకుల్ డైలాగ్ ఆమె పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తోంది. మరో కథానాయికగా కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ లక్ష్మి .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Tue, Jul 09, 2019, 10:22 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View