సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె వేశ్యగా నటిస్తుండడంతో, ఆ పాత్రకు కొన్ని బోల్డ్ సీన్స్ కూడా వున్నాయట. ఇటీవలే ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది.
*  ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన 'దొరసాని' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు.
*  కథానాయిక తాప్సీ త్వరలో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది. 'తప్పాడ్' పేరుతో రూపొందే ఈ చిత్రంలో తాను వివాహిత పాత్రను పోషిస్తున్నానని, ఇది తనకొక ఛాలెంజ్ తో కూడిన పాత్ర అవుతుందని తాప్సీ చెప్పింది.
Tue, Jul 09, 2019, 07:08 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View