'అయోగ్య' కొత్త రిలీజ్ డేట్
Advertisement
Advertisement
విశాల్ కథానాయకుడిగా తమిళంలో రూపొందిన 'అయోగ్య' అక్కడ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో వచ్చిన 'టెంపర్' కి ఇది రీమేక్. తెలుగు నుంచి తీసుకున్న కథే కావడం వలన ఇక్కడ విడుదల చేయకూడదని అనుకున్నారు. కానీ క్లైమాక్స్ మార్చిన కారణంగా తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనకి వచ్చారు.

ఈ నెల 12న విడుదల కానున్నట్టు పోస్టర్లు కూడా వచ్చాయి. అయితే ఆ రోజున 'దొరసాని' .. 'రాజ్ దూత్' .. 'నిను వీడని నీడను నేనే' సినిమాలు విడుదలవుతున్నాయి. అందువలన 'అయోగ్య' ఈ నెల 27వ తేదీకి వెళ్లింది. సార్థక్ మూవీస్ అధినేత ప్రశాంత్ గౌడ్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ సినిమాలో విశాల్ సరసన రాశి ఖన్నా నటించిన సంగతి తెలిసిందే.
Mon, Jul 08, 2019, 05:51 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View