త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే!
Advertisement
త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా హీరో ఎవరనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది.

వెంకటేశ్ తో గానీ .. మహేశ్ బాబుతో గాని చేయవచ్చనే టాక్ కొన్నిరోజుల క్రితం వరకూ వినిపించింది. కానీ తాజాగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.  ప్రస్తుతం అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా జనవరిలో విడుదలైపోతుంది. ఆ తరువాత త్రివిక్రమ్ ఫ్రీ అవుతాడు. ఇక రాజమౌళి సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ కూడా జనవరికి ఫ్రీ అవుతాడట. అందువలన ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన మాటలు జరిగిపోయాయని అంటున్నారు. ఇంతకు ముందు వీళ్ల కాంబినేషన్లో 'అరవింద సమేత' వచ్చిన సంగతి తెలిసిందే. 
Mon, Jul 08, 2019, 05:11 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View