నగ్న సన్నివేశంలో ఎలా నటించానంటే..!: అమలాపాల్ వివరణ
Advertisement
తన తాజా చిత్రం 'ఆడై'లో అమలాపాల్ నగ్న సన్నివేశంలో నటించి అందరినీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ పత్రిక 'ది హిందూ'తో ఆమె మాట్లాడుతూ, న్యూడ్ సీన్ సందర్భంగా ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించడంపై దర్శకుడు రత్నకుమార్ తనతో చర్చించారని... అయితే, కంగారు పడాల్సిన పని లేదని తాను ఆయనకు చెప్పానని తెలిపింది. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే రోజున తాను చాలా టెన్షన్ కు గురయ్యానని... సెట్స్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠకు గురయ్యానని... సెట్స్ లో ఎవరెవరు ఉంటారు? తనకు రక్షణ ఉంటుందా? అని కంగారు పడ్డానని చెప్పింది.

అయితే చాలా క్లోజ్డ్ సెట్ ను దర్శకుడు ఏర్పాటు చేశారని... కేవలం 15 మంది మాత్రమే సెట్స్ లో ఉన్నారని అమలాపాల్ తెలిపింది. క్రూ సభ్యులపై నమ్మకం లేకపోతే తాను ఆ సన్నివేశాన్ని చేయలేకపోయేదాన్నని చెప్పింది.
Mon, Jul 08, 2019, 04:39 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View