అఖిల్ తండ్రి పాత్ర కోసం తమిళ నటుడు!
Advertisement
అఖిల్ కథానాయకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఒక వైపున నటీనటుల ఎంపిక జరిగిపోతూనే వుంది.

ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్రకి కథాపరంగా చాలా ప్రాధాన్యత వుంటుందట. అందువలన కొంతమంది పేర్లను పరిశీలించి, తమిళ దర్శకుడు - నటుడు అయిన సముద్రఖనిని తీసుకున్నట్టుగా సమాచారం. తెలుగులో ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. రాజేంద్ర ప్రసాద్ మాదిరిగా, ఇటీవల తమిళంలో తండ్రి పాత్రలకి సముద్రఖని కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. త్వరలో ఆయన ఈ తరహా పాత్రలతో తెలుగులోను బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో చేస్తోన్న సంగతి తెలిసిందే. 
Mon, Jul 08, 2019, 04:05 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View