కశ్మీర్ లో మహేశ్.. ఆర్మీకి చెందిన సన్నివేశాల చిత్రీకరణ
Advertisement
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే విషయం తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగు మొదలైంది.

మహేశ్ బాబు తదితరులపై అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. చాలా కాలం తరువాత ఈ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకిగాను ఆమె 3 కోట్లు పారితోషికం అందుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 'మహర్షి' వంటి భారీ హిట్ తరువాత మహేశ్ బాబు చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
Mon, Jul 08, 2019, 03:36 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View