ఇక్కడ ఒత్తిడి ఎక్కువ.. మా అబ్బాయిని నటన దిశగా ప్రోత్సహించను: నటుడు ఆదిత్య ఓమ్
Advertisement
Advertisement
నటుడిగా వివిధ భాషల్లో ఆదిత్య ఓమ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆయన తెరపై కనిపించి చాలా కాలమే అయింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఒక నటుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను .. ఇంకా పోరాటం చేస్తూనే వున్నాను. ఎవరికీ టచ్ లో వుండే అలవాటు లేకపోవడం నా లోని లోపంగా భావిస్తాను.

చిత్రపరిశ్రమలో పోటీ ఎక్కువ .. ఇక్కడ వుండే మానసికపరమైన ఒత్తిడి ఎక్కువ. ఇక్కడ వుండే సాధక బాధకాలు దగ్గరగా చూసినవాడిని నేను. అందువలన నా వైపు నుంచి నేను ఎవరినీ ప్రోత్సహించను. మా అబ్బాయిని కూడా నటన దిశగా నేను ప్రోత్సహించడం లేదు. తెలుగులో ప్రస్తుతం నాకు అవకాశాలు లేకపోయినా, భవిష్యత్తులో బిజీ అవుతాననే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు. 
Mon, Jul 08, 2019, 01:17 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View