'సాహో' నుంచి హుషారెత్తించే సాంగ్
Advertisement
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'సాహో' రూపొందింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటించింది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగును రిలీజ్ చేశారు. ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ మరికొంతమంది డాన్సర్లపై చిత్రీకరించిన ఈ పాట, జోరుగా హుషారుగా కొనసాగుతోంది. డిఫరెంట్ లుక్ తో ప్రభాస్ కనిపిస్తుండగా, హాట్ లుక్స్ తో శ్రద్ధా కపూర్ ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Mon, Jul 08, 2019, 11:35 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View