'జబర్దస్త్' నా కుటుంబాన్ని ఆదుకుంది: కమెడియన్ నెమలి రాజు
Advertisement
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఈ షోకి పరిచయమైన నెమలి రాజు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'జబర్దస్త్' నరేశ్ కంటే పొట్టిగా కనిపిస్తూ .. తన వెరైటీ డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " నేను ప్రకాశం జిల్లా 'పొదిలి' ప్రాంతానికి చెందినవాడిని. మాకు కొంత పొలం ఉన్నప్పటికీ, వర్షాలు లేక .. పంటలు పండక మా నాన్న విజయవాడ వచ్చి కూలీగా చేస్తున్నాడు. ఇల్లు గడవడం కష్టంగా వున్న పరిస్థితుల్లో నేను రైటర్ రాజు కంటపడటం .. ఆయన నన్ను 'జబర్దస్త్' టీమ్ కి పరిచయం చేయడం జరిగింది. 'జబర్దస్త్' పుణ్యమా అని మా కుటుంబం ఆర్ధిక పరమైన సమస్యల నుంచి బయటపడింది. ఎక్కడికి వెళ్లినా జనం గుర్తుపడుతుండటంతో, సంతోషంగానూ .. గర్వంగాను వుంది" అని చెప్పుకొచ్చాడు.
Mon, Jul 08, 2019, 10:48 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View