విశాల్ ఎంతమాత్రం తగ్గడం లేదు
Advertisement
విశాల్ కథానాయకుడిగా కొన్ని రోజుల క్రితం తమిళంలో 'అయోగ్య' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' సినిమాకి ఇది రీమేక్. అందువలన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయమని ఆ మధ్య విశాల్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఆయన తన మనసు మార్చుకున్నాడు.

తమిళంలో క్లైమాక్స్ మార్చిన కారణంగా, తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆ రోజున 'దొరసాని' .. 'రాజ్ దూత్' వంటి యూత్ ఫుల్ స్టోరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని సన్నిహితులు చెప్పినా ఆయన తగ్గడం లేదట. 'అయోగ్య' సినిమాకు తెలుగులో ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలి.
Sat, Jul 06, 2019, 05:11 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View