'ఈ కథకు నేను సరిపోను... అన్నా, కథ విను' అంటూ ప్రభాస్ వద్దకు దర్శకుడిని పంపిన 'కేజీఎఫ్' యష్!
Advertisement
సూపర్ హిట్ చిత్రం 'కేజీఎఫ్‌'తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హీరో యష్‌, తన వద్దకు వచ్చిన ఓ కథను ప్రభాస్‌ కు రికమండ్‌ చేశాడు. శాండల్ వుడ్‌ వర్గాల్లో ఇదిప్పుడు హాట్ టాపిక్. ఓ యువ దర్శకుడు క్రేజీ స్టోరీతో యష్ ను సంప్రదించగా, భారీ హీరోయిజం, స్టార్‌ ఇమేజ్‌ ను ఆ పాత్ర డిమాండ్ చేస్తున్నదని, ఈ కథకు తాను సరిపోనని, ప్రభాస్‌ అయితే సరిపోతాడని అన్నాడట. అంతేకాదు, స్వయంగా ప్రభాస్ కు ఫోన్ చేసి, విషయం చెప్పి, సదరు దర్శకుడు చెప్పే కథను వినాలని కోరాడట. తన సబ్జెక్ట్ పై యష్‌ చూపిన చొరవతో ఆ దర్శకుడు ఎంతో సంతోషించాడట. కాగా, ప్రస్తుతం యష్, 'కేజీఎఫ్-2'లో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే.
Sat, Jul 06, 2019, 11:35 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View