అది చదివి ఏడ్చేశా.. ఇకపై మరింత కష్టించి పనిచేయడానికి నాకది స్ఫూర్తి: సమంత
Advertisement
ఓ వెబ్‌సైట్ రాసిన రివ్యూని చదివి సమంతకు కన్నీళ్లు ఆగలేదట. నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రం నేడు విడుదలై మొదటి ఆటతోనే మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ చిత్రంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సామ్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

ఈ సినిమా విడుదల నేపథ్యంలో తాను రాత్రంతా నిద్ర పోలేదని, ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నానని సామ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అలాగే ఈ సందర్భంగా తీసిన ఫోటోను కూడా ఆమె షేర్ చేసింది. సినిమాపై ఓ వెబ్‌సైట్, ఈ మధ్యకాలంలో వచ్చిన మహిళా ప్రాధాన్యమున్న ఏ సినిమానూ ప్రేక్షకులు ఇంతలా ఆదరించలేదని, ఇది సమంతకే సాధ్యమైందంటూ రివ్యూలో రాసింది. దీన్ని చూసిన సామ్, రివ్యూ చదివి ఏడ్చేశానని, తాను ఇకపై మరింత కష్టించి పని చేయడానికి ఆ రివ్యూ స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంది.
Fri, Jul 05, 2019, 08:02 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View