సమంత జీవితం ఒక సక్సెస్ స్టోరీ!: కంగన సోదరి ప్రశంసలు
Advertisement
సమంత ప్రధాన పాత్రలో ‘ఓ బేబీ’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సామ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. ఈ సినిమాతో సామ్ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారని పేర్కొంటూ ఓ వెబ్‌సైట్ కథనాన్ని రాసింది. ఈ వార్తను బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి రీ ట్వీట్ చేసి.. సమంతపై ప్రశంసల జల్లు కురిపించింది.

‘ఓ బేబీ’ అద్భుతమైన విజయాన్ని అందుకుందని, సమంత అసలు సిసలైన స్త్రీవాది అని రంగోలి పేర్కొంది. సామ్ జీవితం ఓ విజయవంతమైన కథ అని, ఓ గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండి కూడా తనకంటూ సొంత గుర్తింపును సమంత సంపాదించుకుందని రంగోలి పేర్కొంది. సమంత వంటి దేవతల్ని తాము ప్రశంసిస్తామని, కంగన బృందం నుంచి ఆల్ ది బెస్ట్ చెబుతూ రంగోలి ట్వీట్ చేసింది. ఇది చూసిన సమంత స్పందిస్తూ, ఎంతో ప్రేమ కురిపించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రంగోలీకి సమాధానమిచ్చింది.
Fri, Jul 05, 2019, 06:11 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View