వాళ్లకి పనీపాటా లేదు.. పనికొచ్చే వాటిపై శ్రద్ధ పెట్టండి: రష్మి ఫైర్
Advertisement
కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని ఉర్రూతలూగించాయి. తాజాగా ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’ వచ్చింది. ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటంటే, ఓ టేబుల్‌పై బాటిల్‌ను పెట్టి, దాని మూతను లూజ్ గా ఉంచాలి. దానికి కొద్ది దూరంలో నిలబడి మూతను బాటిల్ కింద పడకుండా తన్నాలి. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఈ ఛాలెంజ్‌లో విజయవంతమవడమే కాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ను స్వీకరించి తమ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే ఈ ఛాలెంజ్‌పై ప్రముఖ యాంకర్ రష్మి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఛాలెంజ్ నిజంగా సీరియస్‌గా తీసుకుంటున్న వాళ్లకి పనీపాటా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై పెట్టే శ్రద్ధను పనికొచ్చే వాటిపై పెట్టాలని సూచించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలనుకుంటున్న వారు సెలబ్రిటీల పేర్లను వాడుకుంటున్నారని.. అలాంటి వారు సెలబ్రిటీలు చేసే మంచి పనులను కూడా చూడాలని తెలిపింది. సెలబ్రిటీలు చేసే మంచి పనుల్లో ఒక్క దాన్ని కూడా వారి అభిమానులు పాటించట్లేదని పేర్కొంది.
Thu, Jul 04, 2019, 08:20 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View