తమిళ 'బిగ్‌బాస్ 3' ద్వారా కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న లోస్లియా!
Advertisement
బిగ్‌బాస్ షో ఇప్పటికే పూర్తి చేసుకున్న రెండు సీజన్లతో ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్‌ను సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో తెలుగులోనే కాదు, తమిళ్‌లో కూడా రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే తమిళనాట మూడవ సీజన్‌ ఇప్పటికే ప్రారంభమైంది. షో మొదలైన కొన్నాళ్లకే ఓ కంటెస్టెంట్ తెగ పాప్యులారిటీని సంపాదించేసుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఆమే, శ్రీలంకకు చెందిన లోస్లియా మరియనేసన్. ఆమె అక్కడి న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తోంది.

బిగ్‌బాస్‌ 3లో కంటెస్టెంట్‌గా వచ్చిన అనతి కాలంలోనే లోస్లియా ఓ రేంజ్‌లో క్రేజ్‌ను సంపాదించుకుంది. అందం, మాట తీరు, చలాకీతనం, పాటలు పాడుతూ తోటి కంటెస్టెంట్లనే కాకుండా ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తోంది. దీంతో లోస్లియా పేరుతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఆర్మీ కూడా ఏర్పాటైంది. గత సీజన్‌లో ఓవియాకు వచ్చినంత పాప్యులారిటీ, లోస్లియాకు స్వల్ప కాలంలోనే వచ్చేసింది. ఆమె పాడిన పాటలు, చేసిన డ్యాన్సులు టిక్‌టాక్‌తో పాటు హలో యాప్‌లోనూ ట్రెండింగ్ అవుతున్నాయి.  
Thu, Jul 04, 2019, 07:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View