'బాహుబలి సమంత'... కటౌట్ పై ముద్దుగుమ్మ ఫన్నీ కామెంట్!
Advertisement
అక్కినేని వారింటి కోడలు సమంత ప్రధాన పాత్రలో ఎమోషనల్‌ కామెడీగా తెరకెక్కిన 'ఓ బేబీ' రేపు విడుదల కానుండగా, హైదరాబాద్‌ లోని ఓ థియేటర్‌ దగ్గర ఏర్పాటు చేసిన బాహుబలి సైజ్ సమంత కండల కటౌట్, ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుండగా ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. తన స్నేహితుడు ఈ కటౌట్ ను తన జిమ్ కు వ్యాపార ప్రకటన నిమిత్తం వాడుకోవాలని భావిస్తున్నాడని, మీ కటౌట్ ను కొద్దిగా మార్చి కండలు కనిపించేలా చేశాడని చెప్పిన ఓ నెటిజన్ వ్యాఖ్యపై సమంత కూడా స్పందించింది. "బేబీ ఆన్‌ స్టెరాయిడ్స్‌" అని సమాధానం ఇచ్చింది. కాగా, రేపు విడుదలవనున్న సినిమాలో నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.
Thu, Jul 04, 2019, 11:24 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View