సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  అమలాపాల్ కథానాయికగా రత్నకుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రాన్ని 'ఆమె' పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో అమలాపాల్ బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో దీనికి బాగా క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో ఈ చిత్రం తెలుగు హక్కులను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీసుకున్నారు.
*  'మహర్షి' చిత్రం తర్వాత మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. 'సరిలేరు నీకెవ్వరూ' పేరిట రూపొందే ఈ చిత్రం షూటింగ్ రేపటి (శుక్రవారం) నుంచి కశ్మీర్లో జరుగుతుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించే ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషించనున్నారు.
*  తాజాగా 'ఓ బేబీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అందాలభామ సమంత త్వరలో ఓ తమిళ చిత్రంలో నటించనుంది. గోపి నైనర్ దర్శకత్వం వహించే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కోసం సమంతను అడుగుతున్నట్టు, ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.
Thu, Jul 04, 2019, 07:09 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View