‘మిస్ మ్యాచ్’లో పవన్ ‘తొలిప్రేమ’ పాట
Advertisement
ఎస్వీ నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ‘ఆటగదరా శివ’ ఫేం ఉదయ శంకర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. రెజ్లింగ్ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అంశం ఒకటి ఉంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’లోని ఓ పాటను రీమిక్స్ చేశారు.

ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. దీనిలో భాగంగా ఐశ్వర్య రాజేశ్, చిత్ర యూనిట్‌తో కలిసి హైదరాబాద్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది. తాను ఇప్పటి వరకూ ఎంపిక చేసుకున్న చక్కని కథల్లో ‘మిస్ మ్యాచ్’ ఒకటని వెల్లడించింది. చిత్రం తప్పక విజయవంతమవుతుందని ఐశ్వర్య ధీమా వ్యక్తం చేసింది.
Tue, Jul 02, 2019, 07:28 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View