రామ్ ఆశలన్నీ 'ఇస్మార్ట్ శంకర్'పైనే
Advertisement
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది. ఇటీవలే జరిగిన ఒక పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పూర్తయింది. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన టీజర్ కు.. మణిశర్మ స్వరకల్పనలో వదిలిన నాలుగు పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే ఆశతో రామ్ వున్నాడు. ఆయన ఆశ ఈ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి. మాస్ లుక్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా నిధి అగర్వాల్ - నభా నటేశ్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
Tue, Jul 02, 2019, 03:21 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View