'రాజుగారి గది 3' .. తమన్నా ప్లేస్ లో తాప్సీ
Advertisement
'రాజుగారి గది' .. 'రాజుగారి గది 2' వంటి హారర్ కథలను తెరపైకి తీసుకొచ్చిన ఓంకార్, 'రాజుగారి గది 3' కోసం రంగంలోకి దిగాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఆయన సమంతను ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ఒప్పుకోలేదు. దాంతో తమన్నాను ఓంకార్ ఎంపిక చేసుకున్నాడు.

ఈ సినిమాను లాంచ్ చేసిన రోజున కూడా తమన్నా వచ్చింది. అయితే ఆ తరువాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. హిందీ సినిమాలో ఛాన్స్ రావడం వలన తప్పుకుందని కొంతమంది అంటుంటే, కథలో మార్పులు చేయడం నచ్చక తప్పుకుందని మరికొంతమంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాప్సీతో ఓంకార్ సంప్రదింపులు జరుపుతున్నాడట. ఆమె ఓకే అంటే రెగ్యులర్ షూటింగు మొదలైపోతుంది. మరి ఆమె ఏమంటుందో చూడాలి. 
Tue, Jul 02, 2019, 12:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View