పదో తరగతిలోనే సినిమాల్లోకి వచ్చాను: నటి లతాశ్రీ
Advertisement
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల ద్వారా లతాశ్రీ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు.

"నా అసలు పేరు 'పద్మలత' .. సినిమాల్లోకి వచ్చాక 'శ్రీలత'గా మార్చారు. ఆ తరువాత 'లతాశ్రీ' అని మార్చుకుంటే కలిసొస్తుందని ఒక సిద్ధాంతి చెబితే అలా మార్చుకున్నాను. నిజంగానే అప్పటి నుంచి అవకాశాలు పెరిగాయి. మొదటి నుంచి నాకు డాన్స్ .. నటన అంటే ఇష్టం. విజయవాడలో పదో తరగతి చదువుతుండగానే తమ్మారెడ్డి భరద్వాజాగారి సినిమాలో ఒక హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలైన తరువాత 'పోలీస్ భార్య'లో చేశాను. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఇక కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు" అని చెప్పుకొచ్చారు. 
Tue, Jul 02, 2019, 10:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View