'కబాలి' దర్శకుడితో రానా మల్టీస్టారర్ ?
Advertisement
ఒక వైపున తెలుగులో తనకి నచ్చిన కథలు .. మరో వైపున బాలీవుడ్లో తనకి నచ్చిన పాత్రలు చేసుకుంటూ రానా బిజీగా వున్నాడు. కెరియర్ మొదటి నుంచి తమిళ సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ వస్తోన్న ఆయన, ఆర్యతో కలిసి ఒక మల్టీ స్టారర్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కోలీవుడ్లో మరో మల్టీ స్టారర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.

 ఈ సినిమాకి పా రంజిత్ దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు. 'కబాలి' .. 'కాలా' చిత్రాలతో పా రంజిత్ తన క్రేజ్ పెంచుకున్నాడు. భారీ మల్టీ స్టారర్ కోసం ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ సినిమాలో ఒక కథానాయకుడిగా రానాను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. మరో కథానాయకుడు ఎవరనేది త్వరలో తెలియనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు.
Tue, Jul 02, 2019, 10:27 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View