చాలాకాలం తరువాత... ఒకే చోట చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్!
Advertisement
టాలీవుడ్ లో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ ముగ్గురూ ఓకే చోట కనిపించడం చాలా అరుదు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన టాలీవుడ్ నటీ నటుల క్రికెట్ పోటీల్లో కనిపించిన తరువాత, వీరు ముగ్గురూ కలిసి ఒకేచోట మరోసారి కనిపించలేదు. కానీ, నిన్న రాత్రి వీరు ముగ్గురూ కలిశారు. సోమవారం నాడు ప్రముఖ దర్శకుడు, వీరు ముగ్గురికీ సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు జరుగగా, ముగ్గురూ హాజరయ్యారు. కోదండరామిరెడ్డికి కేక్ తినిపించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌ రాజు, అనిల్ సుంకర, ఎమ్మెస్ రాజు, దర్శకుడు బీ గోపాల్, కేఎల్ నారాయణ, ఎస్ గోపాల్‌ రెడ్డి, సంగీత దర్శకుడు కోటి తదితరులు కూడా హాజరయ్యారు. ముగ్గురు హీరోలూ కలిసున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Tue, Jul 02, 2019, 10:08 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View