సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
 *  అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న 'సైలెన్స్' చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా అమెరికాలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికి ఏభై శాతం టాకీ పార్ట్ పూర్తయినట్టు చెబుతున్నారు. హేమంత్ మధుకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న విషయం విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నుంచి జరుగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి.  
*  వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాల్మీకి' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నిన్నటి నుంచి అనంతపురంలో జరుగుతోంది. గత షెడ్యూల్ ను కర్నూల్ లో నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
Tue, Jul 02, 2019, 07:17 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View