ఓడిపోయిన బాధలో ఉన్న మేము ఎలా దాడులు చేస్తాం?: టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్
01-07-2019 Mon 20:33
- దాడులు చేయడం మాకు తెలియదు
- టీడీపీ లేకుండా చెయ్యాలని చూస్తున్నారు
- భౌతికదాడులకు పాల్పడటం తప్పు

ఏపీలో తమ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో, వైసీపీ నేతలు కూడా టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘టీవీ 9’ లో జరిగిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నాయకుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, దాడులు చేయడం అనేది తమకు తెలియదని అన్నారు.
అయినా, ఎన్నికల్లో ఓడిపోయిన బాధలో ఉన్న తాము వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఎలా దాడులు చేస్తామని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చెయ్యాలని, ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను అణచివేయాలని భౌతిక దాడులకు పాల్పడటం తప్పని సూచించారు. ఇదే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల వైసీపీ ఎంపీ నందిగామ సురేశ్ స్పందిస్తూ, గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని, మరి అప్పుడు దాడులకు పాల్పడ్డారా? అని ప్రశ్నించడం గమనార్హం.
ADVERTSIEMENT
More Telugu News
కేన్స్ లో నా బ్రాండ్ ఇదే: పూజా హెగ్డే
5 minutes ago

తెలంగాణలో తాజాగా 47 మందికి కరోనా పాజిటివ్
33 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
2 hours ago
