సంక్రాంతి బరిలోకి దిగుతున్న శర్వానంద్
Advertisement
ఈ మధ్య '96' సినిమా రీమేక్ షూటింగులో శర్వానంద్ భుజానికి గాయం కావడం .. శస్త్రచికిత్స జరగడం తెలిసిందే. రీసెంట్ గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన, తన తదుపరి చిత్రం పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. శర్వానంద్ కథానాయకుడిగా నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి 'శ్రీకారం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

సుకుమార్ క్లాప్ తో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. అయితే శర్వానంద్ ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాతనే షూటింగులో జాయిన్ అవుతాడు. ఈ లోగా మిగతా ఆర్టిస్టుల కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. త్వరలోనే కథానాయిక పేరును ప్రకటించనున్నారు. రామ్ ఆచంట - గోపీనాథ్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఆల్రెడీ బాలకృష్ణ .. నాగార్జున .. మహేశ్ బాబు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.  
Mon, Jul 01, 2019, 03:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View