మహేశ్ మూవీ కోసం భారీ సెట్లు
Advertisement
మహేశ్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమా కోసం 90 కోట్ల వరకూ ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. కథ మేరకు రెండు భారీ సెట్లను నిర్మించవలసి ఉందట. అలాగే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను కశ్మీర్లో 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారని అంటున్నారు.

మహేశ్ బాబు లాభాల్లో వాటా తీసుకోనున్నాడనీ, మిగతా నటీనటులకి చెల్లించే  పారితోషికాలే 25 కోట్ల వరకూ వుంటాయని అంటున్నారు. చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తోన్న విజయశాంతికి పారితోషికంగా 3 కోట్ల వరకూ ముడుతుందని చెబుతున్నారు. ఈ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు .. అనిల్ సుంకర, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Mon, Jul 01, 2019, 02:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View