అమీషా పటేల్ కు ఆర్థిక కష్టాలు.. నోటీసులు జారీచేసిన కోర్టు!
Advertisement
ప్రముఖ నటి, ‘బద్రి’ సినిమా హీరోయిన్ అమీషా పటేల్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఆమె ఓ సినిమా కోసం ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కోర్టు ఆమెకు నోటీసులు జారీచేసింది. బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన అమీషా పటేల్ ఆ తర్వాత నిర్మాతగా మారింది. ‘దేశీ మ్యూజిక్’ పేరుతో ఓ సినిమాను నిర్మించింది. 2013లో ప్రారంభమైన ఈ సినిమా అనేక కారణాలతో రిలీజ్ కాలేదు.

అయితే ఈ సినిమా కోసం అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ నుంచి రూ.3 కోట్ల అప్పు తీసుకుంది. ఈ క్రమంలో అమీషా పటేల్ అప్పు చెల్లించకపోవడంతో అజయ్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో అమీషా పటేల్ ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయింది. దీంతో ఈ నెల 8న విచారణకు స్వయంగా హాజరుకావాలని ముంబైలోని ఓ కోర్టు ఆమెకు నోటీసులు జారీచేసింది. ఒకవేళ విచారణకు హాజరుకాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేస్తామని హెచ్చరించింది.
Mon, Jul 01, 2019, 12:14 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View