ఎన్టీ రామారావుగారితో నేను అలా ప్రవర్తించడంతో అంతా ఆశ్చర్యపోయారు: సీనియర్ నటుడు శివకృష్ణ
Advertisement
హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా శివకృష్ణకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. "ఎన్టీ రామారావుగారితో దేవీవరప్రసాద్ గారు 'నా దేశం' సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నన్ను అనుకున్నారు. అప్పటివరకూ హీరోగా చేస్తూ వస్తున్న నేను, ఆ వేషం వేస్తానా .. లేదా? అనేది దేవీవరప్రసాద్ గారి సందేహం. అయితే నేను ఎన్టీ రామారావుగారి అభిమానినని తెలిసి నన్ను అడిగారు.

నేను వెంటనే ఓకే చెప్పేయడం .. పారితోషికం కూడా అవసరం లేదని చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు. షూటింగుకి ముందురోజు ఎన్టీ రామారావుగారిని పరిచయం చేశారు. ఆయన కాళ్లమీద పడిపొమ్మని అంతా అన్నారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే తొలిసారి ఎన్టీఆర్ ను కలవగానే, ఆయన చేయి అందుకుని చేతిపై ముద్దు పెట్టాను. అంతే.. చుట్టూ వున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఎన్టీ రామారావుగారు మాత్రం నవ్వుతూ ఆత్మీయంగా పలకరించారు" అని చెప్పుకొచ్చారు. 
Mon, Jul 01, 2019, 12:03 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View