ఝాన్సీని నేను వేధించాననడంలో నిజం లేదు: జోగినాయుడు
Advertisement
యాంకర్ ఝాన్సీ .. జోగినాయుడు ఇద్దరూ కూడా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ తరువాత వెండితెరకి వెళ్లినవారే. కెరియర్ ఆరంభంలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ, ఆ తరువాత కాలంలో విడిపోయారు. తాజా ఇంటర్వ్యూలో జోగినాయుడు మాట్లాడుతూ, ఆ విషయాలను గురించి ప్రస్తావించాడు."ఝాన్సీ .. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఓ ఎనిమిది సంవత్సరాల పాటు మా వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఎప్పుడైతే సరదాలు .. విలాసాల విషయంలో ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడతామో, అప్పుడే జీవితం నాశనమవుతుంది. ఇలాంటి అంశాలు మా మధ్య చోటుచేసుకోవడం వల్లనే గొడవలు మొదలయ్యాయి. ఆమెను నేను వేధించానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె నా నుంచి విడిపోవడానికి కారణం ఆర్ధికపరమైన విషయాలే. ఆమె కోసం 8 సంవత్సరాలు ఎదురుచూసి, ఆ తరువాతే మరో పెళ్లి చేసుకున్నాను"  అని చెప్పుకొచ్చాడు. 
Mon, Jul 01, 2019, 11:32 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View