ఆలోచనలోపడిన బోయపాటి శ్రీను
Advertisement
బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని బోయపాటితో చేయవలసి వుంది. అయితే తన పారితోషికం కాకుండా 60 కోట్ల బడ్జెట్ అవుతుందని బోయపాటి చెప్పాడట. దాంతో బాలకృష్ణ ఎక్కడెక్కడ బడ్జెట్ తగ్గించవచ్చునో చూసి చెప్పమనీ, కథలో కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పారట. కథలో ఆయన చెప్పిన మార్పులు చేసిన బోయపాటి, బడ్జెట్ ను కూడా 40 కోట్లకి తీసుకొచ్చేశాడని సమాచారం.

ఈ విషయాలను ఆయన బాలకృష్ణకి చెప్పడం కూడా జరిగిపోయిందట. ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం బోయపాటి ఎదురుచూస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో ఆలస్యం జరుగుతూ ఉండటంతో బాలయ్య అంగీకారం కోసం ఎదురుచూడటమా? లేక మరో హీరోతో .. మరో కథతో ముందుకు వెళ్లడమా? అనే ఆలోచనలో బోయపాటి పడినట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే
Mon, Jul 01, 2019, 10:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View