నా ప్రియుడు నా కంటే చిన్నవాడైతే మీకొచ్చే సమస్యేంటో?: నటి మలైకా అరోరా
Advertisement
సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్ నటి మలైకా అరోరా (43) స్పందించింది. తాను మళ్లీ ప్రేమలో పడడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇది మీకు సమస్యగా మారిందంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. అసలు మీ బాధంతా తన ప్రియుడు అర్జున్ కపూర్ తన కంటే చిన్నవాడు కావడమేనని పేర్కొంది. అతడు చిన్నవాడైతే మీకొచ్చిన సమస్యేంటో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మీ సమస్యల గురించి పట్టించుకునేంత తీరిక తనకు లేదని, ఎవరినో సంతోష పెట్టేందుకు తానిక్కడ లేనని తేల్చి చెప్పింది. రిలేషన్‌షిప్‌లో వున్నప్పుడు వయసు తారతమ్యం పెద్ద సమస్య కాబోదని స్పష్టం చేసింది.  

తాను 17 ఏళ్ల వయసు నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారని పేర్కొంది. తానో తల్లినని గుర్తు చేసిన మలైకా.. ఓ బిడ్డకు తల్లినైనంత మాత్రాన హాట్‌గా కనిపించకూడదా? అని ప్రశ్నించింది. సెక్సీగా ఉండడం తప్పెలా అవుతుందని నిలదీసింది. స్త్రీ అనగానే ఒకరికి భార్యగానో, మరొకరికి తల్లిగానో చూడకూడదని హితవు పలికింది. తానో మాతృస్వామిక కుటుంబం నుంచి వచ్చానని మలైకా వివరించింది.
Mon, Jul 01, 2019, 08:52 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View