బ్లడ్ క్యాన్సర్ తో మృతిచెందిన మల్లు రమేశ్ పాడె మోసిన రేణుకా చౌదరి
30-06-2019 Sun 21:02
- స్నానాల లక్ష్మీపురంలో అంత్యక్రియలు
- హాజరైన కాంగ్రెస్ నేతలు
- రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రేణుకా చౌదరి

పీసీసీ మాజీ అధ్యక్షుడు మల్లు అనంతరాములు తనయుడు, ఏఐసీసీ మాజీ సభ్యుడు మల్లు రమేశ్ బ్లడ్ క్యాన్సర్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అనుచరుడిగా గుర్తింపు పొందారు. తన సన్నిహితుడు మరణించడంతో రేణుకా చౌదరి విషాదంలో మునిగిపోయారు. ఇవాళ మల్లు రమేశ్ అంత్యక్రియలు ఖమ్మం జిల్లాలోని స్నానాల లక్ష్మీపురంలో జరిగాయి. అంత్యక్రియలకు హాజరైన రేణుకా చౌదరి తన అనుచరుడు మల్లు రమేశ్ పాడె మోశారు. రమేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆమె వారిని ఓదార్చారు. మల్లు రమేశ్ అంత్యక్రియలకు మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. మల్లు రమేశ్, భట్టి విక్రమార్క అన్న కుమారుడే!
More Latest News
3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డును!... ట్విట్టర్ హ్యాండిల్లో కొత్త వాక్యాన్ని చేర్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి!
19 minutes ago

పోలీసులకు దొరకకూడదని టెడ్డీబేర్ లో దాక్కున్న దొంగ!
19 minutes ago

ఆ వీడియో మార్ఫింగ్ చేసినదే... గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్య
31 minutes ago

‘లాల్ సింగ్ చడ్డా’ను గుర్తించిన ఆస్కార్
2 hours ago
