ఆమె బ్యాగు ఖరీదు రూ.2.6 కోట్లు : నీతా అంబానీయా మజాకా!
Advertisement
అసలే అంబానీ కుటుంబం. పైగా ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్‌ అంబానీ సతీమణి. ఇక ఆమెకు లోటేమిటి? ఇది నీతా అంబానీ గురించే. ఆమె వాడే బ్యాగు ఖరీదు ఎంతో తెలుసా... ఏకంగా రూ.2.6 కోట్లు. ఓ సాధారణ మనిషి జీవితాంతం కలగన్నా సంపాదించలేనంత మొత్తం ఇది. కానీ నీతా అంబానీ వాడే బ్యాగు ఖరీదు ఇది. 18 క్యారెట్ల బంగారం పూత, దాదాపు 200 వజ్రాలు పొదగబడి ఉన్న బ్యాగు ఇది. వేలం సంస్థ క్రిస్టీ.కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం హర్మెస్‌ హిమాలయన్‌ బర్కిన్‌ బ్యాగ్ రకం ఇది. ఈ బ్యాగుకు నటి, గాయని జేన్‌ బర్కిన్ పేరు మీద వీటిని బర్కిన్ బ్యాగ్స్‌గా పిలుస్తారు. వాటి ప్రైస్‌ ట్యాగ్, సెలబ్రిటీ యజమానుల కారణంగా ఇవి ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పటి వరకు తాను అమ్మిన వాటిలో ఈ బ్యాగు అత్యంత విలువైందిగా  సంస్థ చెప్పుకొచ్చింది. నైల్ క్రోకోడైల్ చర్మంతో దీన్ని తీర్చిదిద్దినట్లు ఆ సంస్థ పేర్కొంది. బాలీవుడ్‌ నటి కరీష్మా కపూర్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో నీతా అంబానీ చేతిలో ఈ బ్యాగు కనిపిస్తుంది. ఆ ఫొటోలో నీతా, కరీష్మాతో బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ కూడా ఉన్నారు.
Sun, Jun 30, 2019, 01:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View