నాగశౌర్య వేస్ట్ ఫెలో... కావాలనే షూటింగ్ లో అలా ఉన్నాను: రాజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Advertisement
సమంత మెయిన్ క్యారెక్టర్ గా తెరకెక్కిన కొత్త సినిమా 'ఓ బేబీ' మరో ఐదు రోజుల్లో వెండితెరను తాకనున్న వేళ, ప్రీ రిలీజ్ వేడుక జరుగగా, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర పేరు చంటి అని, తానే సమంతకు, లక్ష్మికి బాయ్ ఫ్రెండ్ నని చెప్పారు. తానే బాయ్ ఫ్రెండ్ నని ఫీల్ అవుతున్న నాగశౌర్య వేస్ట్ ఫెలో అని, ఆల్‌ రెడీ కాలు విరగొట్టుకొని వచ్చాడని అంటూ నవ్వులు పూయించారు.

ఇక షూటింగ్ సమయంలో మందు కొట్టి వచ్చారన్న వార్తలపైనా రాజేంద్ర ప్రసాద్ స్పందించాడు. తాను 42 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నడూ మందు కొట్టి షూటింగ్ కు వెళ్లలేదని, 'ఓ బేబీ' సినిమాలో ఉన్న సీన్ కోసం, ఆ మూడ్ ను క్యారీ చేసేందుకు మాత్రమే అలా ఉన్నానని స్పష్టం చేశారు. కాగా, ఈ చిత్రం 5వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Sun, Jun 30, 2019, 11:21 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View