బిగ్ బాస్-3కి నాగార్జున హోస్ట్... కారణమిదేనట!
Advertisement
టాలీవుడ్ బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ సిద్ధమవుతోంది. ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున పనిచేయనున్నారన్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ ను నాని హోస్ట్ చేయగా, మూడో సీజన్ అవకాశం నాగ్ చేతికి వచ్చింది. ఇక నాగార్జున ఎంపిక వెనుక, బిగ్ బాస్ నిర్మాతల మధ్య పెద్ద చర్చే జరిగిందట. తొలి రెండు సీజన్ లూ విజయవంతమైనా, రాత్రి 9 తరువాత టీవీలను చూసే మహిళల నుంచి పెద్దగా స్పందన రాలేదట.

ఇక, ప్రస్తుతం 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు నాగ్ ను ఎంతో అభిమానిస్తారని, వారిని టీవీల ముందు కట్టిపడేయాలంటే, అతనే హోస్ట్ గా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమైందట. ఆ కారణంతోనే నాగార్జునను ప్రయోక్తగా తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నాగ్ తో చేసిన టీజర్, ప్రోమోలు బుల్లితెరపై దూసుకెళుతూ మూడో సీజన్ పై అంచనాలు పెంచుతున్నాయి. ఇక, బిగ్ బాస్ తో పాటు, ఈ సీజన్ లో ఓ బుల్లి కోతి కూడా తన వాయిస్ తో కంటెస్టెంట్ లను హడలెత్తిస్తుందట. ఇప్పటికే ఈ కోతి నాగ్ చేతుల్లో ఆడుతూ కనిపిస్తోంది.
Sun, Jun 30, 2019, 09:02 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View