డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న బన్నీ
Advertisement
ప్రస్తుతం అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు వేణు శ్రీరామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకి 'ఐకాన్' అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో బన్నీ యంగ్ ఏజ్డ్ లోనే కాకుండా మిడిల్ ఏజ్డ్  గెటప్పులోను కనిపిస్తాడట. ఈ రెండేకాదు ఇంకా ఒకటి రెండు గెటప్పులతోను సందడి చేస్తాడని చెబుతున్నారు. ఇలా డిఫరెంట్ గెటప్స్ తో .. కాస్ట్యూమ్స్ తో బన్నీ కనిపిస్తాడని అంటున్నారు. ఈ కథలోని కొత్తదనం .. పాత్రలోని వైవిధ్యం కారణంగానే సుకుమార్ ప్రాజెక్టుకంటే ముందుగా ఈ ప్రాజెక్టు చేయడానికి బన్నీ ఆసక్తిని చూపించాడని అంటున్నారు.

Sat, Jun 29, 2019, 05:11 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View