నా కెరియర్లో మంచివాళ్లను చూశాను .. చెడ్డవాళ్లనూ చూశాను: హీరోయిన్ ఆదాశర్మ
Advertisement
తెలుగులో కథానాయికగా ఆదా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాల పరంగా జోరు చూపకపోయినా, అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'కల్కి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాను గురించి ఆమె మాట్లాడుతూ .. 'కల్కి'లో నేను చేసిన పాత్ర నాకు బాగా నచ్చింది. నా కెరియర్లో నేను చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. రాజశేఖర్ గారితో కలిసి నటించడం ఆనందంగా వుంది. నా కెరియర్లో నేను రాజశేఖర్ .. పూరి జగన్నాథ్ వంటి మంచి వాళ్లనే కాదు, కొంతమంది చెడ్డవాళ్లను కూడా చూడాల్సి వచ్చింది. మంచి ఎక్కువగా జరిగినప్పుడు చెడు గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. మంచి కథల కోసం .. పాత్రల కోసం వెయిట్ చేయడం వలన గ్యాప్ వస్తోంది అంతే తప్ప, తెలుగు ఇండస్ట్రీకి నేను ఎప్పుడూ దూరంగా లేను" అని చెప్పుకొచ్చింది.
Sat, Jun 29, 2019, 03:32 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View