సుకుమార్ చేతుల మీదుగా 'దొరసాని' ట్రైలర్
Advertisement
శివాత్మిక ప్రధాన పాత్రధారిగా 'దొరసాని' రూపొందుతోంది. ఈ సినిమాలో నాయిక జోడీగా ఆనంద్ దేవరకొండ నటించాడు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఓ సాధారణ కుటుంబానికి చెందిన అబ్బాయికి .. దొరవారి కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా నడుస్తుంది.

యూత్ ను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, త్వరలో ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా వచ్చేనెల 1వ తేదీన ఉదయం 10 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలింది. ఈ ప్రేమకథా చిత్రంపై అంచనాలు బాగానే వున్నాయి.
Sat, Jun 29, 2019, 02:55 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View